ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను మరోసారి నిలుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి అయితే బడికి పంపించే ప్రతి పిల్లాడి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తాను అని చెప్పిన మాటను జగన్ పాటిస్తున్నారు. ఇద్దరు పిల్లలను స్కూల్ కి పంపితే 15 వేల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసే పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల చేశారు. పిల్లలను బడికి పంపించే చదివించడం ఏ తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేద ప్రజలు పాదయాత్రలు జగన్ను కలిసి తాము బతకడానికే తాము సంపాదించేది సరిపోవడం లేదని పిల్లలను ఎలా చదివించాలన్నా అంటూ మొరపెట్టుకున్నారు. అయితే వారి కష్టాలను విన్న జగన్ చలించిపోయారు. అధికారంలోకి వచ్చాక పిల్లలు స్కూల్ కి పంపించండి, మీ అకౌంట్లో డబ్బులు నేను ఇస్తాను అంటూ అనేక బహిరంగ సభలో చెప్పారు. ఈ అంశాన్ని అమ్మ ఒడి పథకం పేరుతో మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే ముఖ్యమంత్రి అయిన తరువాత 150 రోజులు గడువు లోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టి జీవో కూడా విడుదల చేసి ఆ పిల్లల తల్లుల అకౌంట్లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
