ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మొట్టమొదటిసారి నవంబర్ 1న జరుగుతున్నాయి. దాదాపుగా రాష్ట్రం విడిపోయి ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తమిళనాడు నుంచి తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే నినాదంతో, ఉద్యమంతో పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం ఫలితంగా, పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంతో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014 చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ తాము అధికారంలోకి వస్తే స్వతహాగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న ఈ వేడుకలు నిర్వహిస్తామంటూ ముందునుంచి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నారు.