చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. రైతులు, నిరుద్యోగులు ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు యావత్ రాష్ట్ర ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. మహిళలు విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పార్టీ నేతలే ఆడవారిపై దురుసుగా ప్రవతిస్తూ వారిపై ఇస్తారాజ్యంగా వ్యవరించేవారు. ఇవన్నీ చంద్రబాబుకి తెలియకుండా జరిగినవి కాదు ఆయన ఆచరణ లేకుండా ఏది జరగదు. అధికారం ఉందనే అహంకారంతో ఎన్నో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇవన్నీ పక్కనబెడితే చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో ఏవేవో మాటలు చెప్పుకొచ్చారు. నేనే అధికారంలోకి వస్తానని, ప్రతిపక్షం లేకుండా చేస్తానని ఎన్నో కబుర్లు చెప్పుకొచ్చారు.
ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారనే సామెతను బాబు నిజం చేసాడు. ఆయన తీసుకున్న గోతులో ఆయనే పడ్డారు. ఎన్నికలు వచ్చి వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచింది. టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యింది. అయితే తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేయడంతో అది కాస్తా 22కి చేరుకుంది. ఇదే తరహాలో మరో ఐదుగురు వంశీ నే ఫాలో అయితే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోతుంది. ఇప్పుడు ఎలా ఉన్న మున్ముందు కచ్చితం అదే జరగబోతుందనే వార్త జోరుగా వినిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ సిగ్నల్ ఇస్తే బాబుకి చుక్కలు చూపించడానికి టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారట. పాపం ప్రతిపక్షమే లేకుండా చేస్తానని చెప్పిన చంద్రబాబుకు చివరికి ఆ స్థానం ఆయనే తీసుకొనేలా ఉన్నాడని అనుకుంటున్నారు.