తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు శుక్రవారం మంత్రి కేటీ రామారావు చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు”ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు,ఎంపీలు ,టీఆర్ఎస్ పార్టీ నేతలు,అధికారులు ,ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.
ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..మునుగోడు ప్రజల తరపున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలు టీఆర్ఎస్ను నమ్ముతున్నరు కాబట్టే రెండోసారి అధికారం కట్టబెట్టారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడ్తయని, మా జీవితాల్లో వెలుగు నింపుతయని ఎంతో ఆశతో కొన్ని లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నరు.
అలాంటి యువకుల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన కార్యక్రమం ఇదన్నారు. పారిశ్రామిక వేత్తలందరినీ ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నామన్నారు. కేటీఆర్‌లాంటి అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టమని” ఆయన అన్నారు.