తాజాగా 130 ఆస్పత్రుల్లో గుర్తించిన సూపర్ స్పెషాలిటీ సేవలను సీఎం వైయస్.జగన్ ప్రారంభించారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులోకి 17 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 716 వైద్యప్రక్రియలు జరగనున్నాయి.చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్ ఆస్పత్రి డాక్టర్లు, అక్కడ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడారు.చికిత్సల విధానంపై డాక్టర్లను ముఖ్యమంత్రి వైయస్.జగన్ అడిగి తెలుసుకున్నారు.తమ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలంటూ వైద్యులను కోరారు.ఎంతో విశ్వాసం, నమ్మకంతో చికిత్సకోసం అక్కడకు వచ్చారన్న సీఎం, వారు కోలుకునేంతవరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పకుండా వారిని మంచిగా చూసుకుంటామని వైద్యులు హామీ ఇచ్చారు.