కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన ప్రాంతంతోపాటు సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పేరు సంపాదించుకున్నారు సిద్ధార్థ్. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తన తాత రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాజకీయంగా హేమాహేమీలతో కయ్యానికి కాలు దువ్వారు. నందికొట్కూరు నియోజకవర్గం తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పార్టీకి సిద్ధార్థ్ ఎనలేని సేవ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సిద్ధార్థ్ తనకు కొడుకు లాంటి వాడు అని చెప్పుకొచ్చారు. ఆయనే నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తనకు కొడుకులు ఇద్దరు కుమార్తెలున్నారని ఒకవేళ తనకు కొడుకు ఉంటే సిద్దార్థ్ లా ఉండాలని కోరుకుంటున్నానని ప్రేమాభిమానాలు చూపించారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటంరెడ్డి ఈ విధంగా మాట్లాడారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా, అవమానించినా, వేధింపులకు గురిచేసినా, ఇబ్బందులు పెట్టినా పాతికేళ్ల వయసులో సిద్ధార్థ చేస్తున్న రాజకీయ పోరాటం అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సిద్ధార్థ్ తన కొడుకులాంటివారని ఓ ఎమ్మెల్యే భావించడం చెప్పుకోదగ్గ విషయం.
