మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి. ముందు నుయ్యా..వెనక గొయ్యా అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. ఇదంతా బాబుగారు చేసుకున్నదే అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఆయనను నమ్ముకొని అధికారంలో కూర్చోబెడితే చంద్రబాబు మాత్రం గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించాడు. ఇదేమిటని ప్రశ్నించే వారిపై దౌర్జన్యంగా వ్యవహరించేవారు. దీంతో విసిగిపోయిన ప్రజలు బాబుకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే ఎన్నికలు..టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 40 ఏళ్ళు రాజకీయ అనుభవం అని చెప్పుకునే బాబు కనీస సీట్లు గెలుచుకోలేకపోయారు అంటే అర్ధంచేసుకోవచ్చు ఆయనపై ఎంత వ్యతిరేకత ఉందో.
ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ గెలిచిన 23 ఎమ్మెల్యేలలో గన్నవరంకి చెందిన వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసి బాబుకి దీపావళి గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా టీడీపీలో రచ్చ మొదలైంది. బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా వంశీ బాబు మనుషులను దరిదాపులకు కూడా రానివ్వడంలేదు. రేపో మాపో వైసీపీ లో చేరుతారనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక్కడితో అయిపోలేదు జగన్ ఓకే చెబితే గెలిచిన వారిలో చాలా మంది టీడీపీ ని వీడడానికి రేడీ అవుతున్నారని తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే త్వరలో టీడీపీ కి రాజీనామా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. ఆయన కూడా రాజీనామా చేస్తే చంద్రబాబుకి తడిగుడ్డే అని అంటున్నారు.