తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే ప్రస్తుతం ఆర్టీసీ స్థితిగతులపై నివేదికను ఎండీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకు నివేదించారు. 2018-19లో రూ.644 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించినట్లు ఆర్టీసీ అధికారులు హైకోర్టుకు తెలిపారు.హైదరాబాద్ మహానగరంలో బస్సులను నడిపినందుకు రూ.1,786 కోట్లను చెల్లించాల్సి ఉంది. కానీ రెండేళ్లల్లో కేవలం రూ.336 కోట్లను జీహెచ్ఎంసీ చెల్లించిందని చెప్పారు. అటు సమ్మె కాలంలో రూ.78 కోట్లు ఆదాయం వస్తే వ్యయం మాత్రం 160 కోట్లకు పెరిగి రూ. 82 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు.
