వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత తొలిసారిగా తలపడిన కివీస్ పై ఇంగ్లాండ్ టీమ్ తొలి మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు ట్వంటీ20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి నూట యాబై మూడు పరుగులను చేసింది. టేలర్ (44),టీమ్ సీపెర్ట్(32) రాణించారు. అనంతరం లక్ష్య సాధనకై బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 18.3ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 154 పరుగులను సాధించింది. అయితే ఈ సిరీస్ తర్వాత ఇరు జట్లు 2 టెస్టులు ఆడనున్నాయి.
