40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుతిరుగుతున్న చంద్రబాబుకు రోజురోజుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక పక్క ప్రజలు, మరోపక్క సొంత పార్టీ, ఇటు ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి దెబ్బలకు బాబుకి ఏమి చెయ్యాలో అర్ధం కావడంలేదు. ప్రస్తుతం అధికార పార్టీ ఐన వైసీపీ ని వేలెత్తి చూపడానికి ప్రతిపక్ష పార్టీ దగ్గర ఏ అస్త్రం లేదని చెప్పని. కాని ఒక ఇసుకు విషయంలో ఏదేదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. దీనిపై బాబుకు గట్టిగా స్ట్రోక్ ఇచ్చారు విజయసాయి రెడ్డి.”తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకుందంటే అక్కడ మీరు పాలన చేయలేదు కదా. మీరు సృష్టించిన ఇసుక మాఫియా పెడరెక్కలు విరిచి కట్టడానికి సిఎం జగన్ గారు కొత్త విధానం తీసుకొచ్చారు. దోపిడీ పాలన అంతమైందని తెలిసి ప్రకృతి కరుణించింది. నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. తేడా అర్థమైంది కదా” అని అన్నారు.
తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకుందంటే అక్కడ మీరు పాలన చేయలేదు కదా. మీరు సృష్టించిన ఇసుక మాఫియా పెడరెక్కలు విరిచి కట్టడానికి సిఎం జగన్ గారు కొత్త విధానం తీసుకొచ్చారు. దోపిడీ పాలన అంతమైందని తెలిసి ప్రకృతి కరుణించింది. నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. తేడా అర్థమైంది కదా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 31, 2019