ఈ రోజు అక్టోబర్ 31… నాగుల చవితినాడు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు..విశాఖ పట్టణం, చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ జన్మ దినోత్సవ వేడుకల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి,ఆశీస్సులు తీసుకున్నారు.భారతదేశం సంస్కృతీ, సంప్రదాయాలకు ఆలవాలం..ఆదిశంకరాచార్యులు దగ్గరనుంచి ఎందరో మహానుభావులు ఈ పుణ్యభూమిలో పుట్టినటువంటి విషయం అందరికి తెలిసిందే. భగవద్గీతలో చెప్పినట్లుగా ధర్మ సంస్ధాపనార్థాయ సంభవామి యుగే యుగే..అన్నట్లుగా ఈ యొక్క సంస్కృతీ, సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని భావితరాలకు అందించేటటువంటి..దిశలో మంచి అనేదాన్ని సమాజానికి నేర్పించడానికి, మహాపురుషులు పుడుతూనే ఉంటారు. అటువంటి మహాపురుషుల కోవకు చెందినవారు..శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారని విజయసాయిరెడ్డి అన్నారు. స్వామివారు సమాజానికి చేస్తున్న సేవ..నిజంగా అద్భుతమైనటువంటిది. విజయనగరం జిల్లాలో రణస్థలంలో జన్మించి..విశాఖ జిల్లాలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడమనేది.. హిందూ సమాజ శ్రేయస్సు కోసం..ప్రజల శ్రేయస్సు కోసం..స్వామివారు కృషి చేయడం మనందరం చేసుకున్న పుణ్యమని విజయసాయిరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మహాస్వామివారికి విజయసాయిరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ, పెందుర్తి వైసీపీ కోఆర్డినేట్ అదీప్‌రాజ్, టీటీడీ తెలంగాణ సలహామండలి వైస్ ప్రెసిడెంట్ సీహచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్లొన్నారు.
