సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి భరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే విజయశాంతి మహేష్ బాబు కొన్ని కామెంట్స్ చేసింది. ” ఈ బాబు సూపర్ స్టార్ అవుతాడని నేను అప్పట్లోనే అనుకున్నాను. ఒక ఇంటర్వ్యూలో చెప్పను కూడా. అప్పట్లో క్రికెట్ లో సచిన్ ఎంత సెన్సేషనల్ గా దూసుకొచ్చాడో ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో మహేష్ బాబు కూడా అంతే సంచలనంగా దూసుకొచ్చాడు. మహేష్ పెద్ద హీరో అవుతాడని నేను అన్నది అనుకున్నది ఇప్పుడు నిజం అయిందని అన్నారు”. మరి ఇంత మంచి మాటలకు మహేష్ అభిమానులు లేడీ అమితాబ్ పై ఎలా రేఅచ్ట్ అవుతారో చూద్దాం..!
