తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం వచ్చే నెల నవంబర్ రెండో తారీఖు నాడు భేటీ కానున్నది. ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నవంబర్ రెండో తారీఖున నాడు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రి వర్గం భేటీ కానున్నది. ఈ భేటీలో ప్రస్తుతం నెలకొన్న ఆర్టీసీ సమ్మె.. ఆర్టీసీపై భవిష్యత్ లో ప్రభుత్వం వ్యవహారించే వైఖరీ.. త్వరలోనే జరగనున్న పురపాలక ఎన్నికలు తదితర అంశాల గురించి చర్చించనున్నారు సమాచారం.
