గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. టీడీపీ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. రికార్డు స్థాయిలో 151 సీట్లు గెలిచింది వైసీపీ పార్టీ. ఇక టీడీపీ విషయానికి వస్తే చాలా దారుణంగా కేలవం 23 సీట్లు మాత్రమే గెలుచుకోగా అందులో గన్నవరం ఎమ్మెల్యే తాజాగా రాజీనామా చేసారు. ఇక ఎంపీల విషయానికి వస్తే గల్లా జయదేవ్, కేసినేని నాని,రామానాయుడు గెలిచారు. టీడీపీ ఎంపీ నాని విషయానికి వస్తే తాజాగా ముఖ్యమంత్రి జగన్ ని పొగడ్తలతో ముత్తేచ్చారు. ఆర్తీసి విలీనం విషయంలో వారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని, ప్రైవేటు ట్రావెల్స్ లాభాలు వస్తేనే పనిచేస్తారని, అదే నష్టాలు వస్తే తప్పుకుంటారాని, దీనివల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తూ జగన్ చేస్తున్న పనులకు బాగున్నాయని అన్నారు. ఒక రోడ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నాని ఈ మాటలు అన్నారు. జగన్ ను ఈ విధంగా అభినందించడంతో కొందరికి జగన్ కు నాని దగ్గరవ్వాలి అనుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
