టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. సీనియర్ నటి. అలనాటి హీరోయిన్ గీతాంజలి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి కాకినాడలో శ్రీరామమూర్తి,శ్యామసుందరి దంపతులకు జన్మించారు.
నలుగురు అమ్మాయిలు,ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. నాలుగేళ్ల వయస్సు నుంచే ఆమె తన అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. మూవీల్లోకి వచ్చాక తన సహాచర నటుడు రామకృష్ణను పెళ్ళి చేసుకున్నారు.
వీరిద్దరికీ ఆదిత్ శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. భూమా అనే మూవీతో గీతాంజలి కుమారుడు హీరోగా పరిచయమయ్యాడు.