ఇటీవల విడాకులు తీసుకున్న మంచు హీరో మనోజ్ కుమార్ సరికొత్త ప్రయాణం మొదలెట్టారు. ఇదే అంశాన్ని మనోజ్ సోషల్ మీడియాలోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా హీరో మనోజ్ ” నేను సరికొత్త ప్రయాణం మొదలెట్టాను. అందుకే ఎమ్ఎం ఆర్ట్స్ ప్రోడక్షన్స్ బ్యానర్ ను ప్రారంభించాను. ఈ బ్యానర్లో మంచి చిత్రాలను ఇక ముందు చూడబోతున్నారు”అని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”నా కొత్త జర్నీ మొదలైంది. ఇకపై నా ప్రోడక్షన్ హౌస్ ఎమ్ఎమ్ ఆర్ట్స్ ప్రోడక్షన్ నిర్మాణంలో నా సినిమాలు వస్తాయి. అలాగే కొత్త టాలెంట్ ను బయటకు తీసి వార్ని ప్రోత్సహించాలనే నిర్మాణరంగంలోకి అడుగు పెట్టాను. ఇక మంచి మంచి సినిమాలను చూస్తారు”అని వివరించారు.
