Home / MOVIES / మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించండి

మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించండి

బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టైటిల్‌ రేసులో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, అలీ రెజా, వరుణ్‌లు ఉన్నారు. అయితే ప్రధాన ఫైట్‌ మాత్రం రాహుల్‌, శ్రీముఖి మధ్యలోనే ఉంది. ఓట్లు వేయడానికి రేపు ఆఖరి రోజు కావటంతో అభిమానులు తమతమ ఫేవరెట్‌ కంటెస్టెంట్లకే ఓట్లు గుద్దండంటూ ప్రచారంతో సోషల్‌ మీడియాను ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్‌’తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులపై ఏపాటి ప్రభావం చూపిస్తుందో గ్రాండ్‌ ఫినాలేనాడు తేలనుంది. మరోపైపు రాహుల్‌ సిప్లిగంజ్‌ కోసం ప్రముఖ సింగర్‌ నోయెల్‌ గట్టి ప్రచారమే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇంకాస్త డోస్‌ పెంచుతూ రాహుల్‌ తల్లి రంగంలోకి దిగింది. ఏకంగా బిగ్‌బాస్‌ టైటిల్‌ కావాలని ఆమె రాహుల్‌ అభిమానులను కోరుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. రాహుల్‌ మంచితనం, నిజాయితీ, ముక్కుసూటి మాటలను మెచ్చి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. మిగిలిన రెండురోజుల్లోనూ మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించమని కోరింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat