ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రకైనా సరైన న్యాయం చెయ్యాలంటే అది ప్రకాష్ రాజ్ తోనే సాధ్యం. ఏ పాత్రలో ఐన ఆయన నటించగలరు. అలాంటి స్టార్ నటుడు ఇటీవలే కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. దాంతో ఆయనను సినిమాలు నుండి బహిష్కరించాలని అఖిలభారత హిందూ మహాసభ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఫిలిం ఛాంబర్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించకూడదని డిమాండ్ చేసారు. ఇక అసలు విషయానికి వస్తే ఆయన ఒక టీవీ ఛానల్ లో ఉత్తరప్రదేశ్లో రథోత్సవానికి ముఖమంత్రి ఆదిత్యనాథ్ ముంబై నుండి హెలికాప్టర్ లో మోడల్స్ ని పిలిపించారని వారికి మేకప్ వేసి వేషాలు వేయించారని వ్యాఖ్యలు చేసాడు.
