ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవనున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ఈ రోజు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ” ఆర్టీసీ సిబ్బంది తమ సమ్మెకు మద్ధతు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలపై పోరాటం చేయాలని కోరారని “అన్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె,వారి సమస్యలపై వివరించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో భేటీ అవుతానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే నాకు అపార అభిమానం… గౌరవం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయి చర్చిస్తానని ఆయన అన్నారు.