ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సంగతి విధితమే. తాజాగా మరో 28,844 ఉద్యోగాల భర్తీకు రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది.
ఇటీవల భర్తీ చేసిన గ్రామ/వార్డు వాలంటీరీ పోస్టులల్లో చేరకపోవడం వలన.. చేరినాక విడిచిపెట్టడం వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం 28,844 పోస్టులల్లో 9,674పోస్టులు గ్రామ వాలంటీరీలు అయితే మిగిలినవి వార్డు వాలంటీరీ పోస్టులున్నాయి.