గురువారం నాడు పాకిస్తాన్ లోని ఒక ట్రైన్ లో పేలుడు సంభవించడంతో సుమారు 62 మంది మరణించగా మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన తేజ్గామ్ ఎక్ష్ప్రెస్స్ లో చోటుచేసుకుంది. ట్రైన్ కరాచీ నుండి రావల్పిండి వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. పాకిస్తాన్ రైల్వే అధికారి చెప్పిన ప్రకారం ఇందులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయని, అదే సమయంలో కొందరు ప్రయాణికులకు వంట వండుతున్నారని తెలిపారు. సిలిండర్ పేలడంతో రెండు ఎకానమీ క్లాస్ బోగీలు మరియు ఒక బిజినెస్ క్లాస్లో మంటలు చెలరేగాయి. అంతేకాకుండా మంటలు మరో రెండు బోగీలను కూడా ముంచెత్తాయి. గాయపడినవారిని దగ్గరలోగల ఆశుపత్రికి తరలించారు.
