తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గిరిజన,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్య్వతి రాథోడ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ “మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నట్లు” ముఖ్యమంత్రి కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.
గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు సందర్భంగా ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవనీయులైన మంత్రి సత్యవతి రాథోడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరిన్ని జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మీరు జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపిన మంత్రి, మీరు ప్రజాజీవితంలో ఎక్కువ కాలం ఉండాలి ఆక్కా అని ఆకాంక్షించారు.
Many returns of the day to Hon’ble Minister Smt. Satyavathi Rathode Garu who celebrates her birthday today ?
Wishing you good health, happiness, peace and a long life in public life Akka pic.twitter.com/9LQRJfzUJS
— KTR (@KTRTRS) October 31, 2019