అక్టోబర్ 31 న అంటే ఈ రోజు నాగులచవితి నాడు విశాఖపట్టణం, చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీ గవర్నర్ స్వయంగా విశాఖ శ్రీ శారదాపీఠానికి విచ్చేసారు. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఘనస్వాగతం పలికారు. శ్రీ స్వరూపానందేంద్ర స్వామివారికి గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహాస్వామివారు గవర్నర్‌ను సత్కరించి, ఆశీర్వదించారు. పీఠంలో దాదాపు అరగంట గడిపిన గవర్నర్ పీఠం నుంచి వైజాగ్‌లోని సర్కూట్ హౌస్‌కు బయలుదేరివెళ్లారు.గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు పీఠం పరిసరాల్లో గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.
