ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ తో ఓడిపోయినా విషయం తెలిసిందే. అప్పటివరకు టీమిండియా నే విన్నర్ అనుకున్నారంతా. సెమీస్ లో ఓడిపోవడంతో ఒక్కసారిగా బోర్డ్, కమిటీ మధ్య రచ్చ మొదలైంది. ఇక జట్టులో నాలుగో స్థానం కోసమే కొన్నిరోజులు వాదనలు చోటుచేసుకున్నాయి. కావలేనే ఎంఎస్కే ప్రసాద్ ఇలా చేసాడని గట్టిగా వార్తలు వచ్చాయి. ఇంక ఇదంతా పక్కనబెడితే తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. దీన్ని స్వయంగా ఫొర్మెర్ ఇండియన్ క్రికెటర్ ఫరోఖ్ ఇంజనీర్ బయటపెట్టాడు. ఇది ఇండియన్ సెలక్షన్ కమిటీని ఒక్కసారిగా కుదిపేసింది. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచకప్ లో భాగంగా ఇండియన్ సెలెక్టర్ ఒకరు భారత సారధి విరాట్ కోహ్లి భార్య కి టీ ఇచ్చారట. ఆయన దీనిని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఇండియన్ సెలెక్షన్ ప్యానల్‌ను ‘మిక్కీ మౌస్’ కమిటీగా ఇంజనీర్ అభివర్ణించారు.
