ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత పరిపాలనలో విజయవంతంగా దూసుకుపోయారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ, ఉద్యోగాల విప్లవం, రైతులకు సాయం వంటి అనేక ప్రజాకర్షక పథకాలతో జగన్ 150 రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష తెలుగుదేశం కూడా జగన్ కు ఒకే ఒక్క అంశంలో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ఒక్క అంశమే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత. చినికి చినికి గాలివానలా ఇసుక కొరత ఇబ్బందులు పెద్దఎత్తున ప్రతిపక్షాలకు ఆందోళన చేసేందుకు అవకాశంగా మారాయి. ఒకవైపున రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు నీరు తో ఉండడం వల్ల తీయడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రజలు ఈ విషయం అర్థం చేసుకున్న ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉండడంతో జగన్ ఈ అంశంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇక నుంచి ప్రతినాయకుడు, ప్రతి అధికారి ఇసుక కోసం పనిచేయాలని రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా లభ్యమైతే అక్కడి నుంచి సేకరించి ప్రజలకు అందించాలని నిర్ణయించారు. అక్రమ ఇసుక రవాణాకు తావులేకుండా ప్రజలకు ఇసుక చేరవేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వం పని చేస్తుంది. ఇదే గనుక జరిగితే జగన్ పై ముఖ్యమంత్రి అయ్యాక పడిన మొట్టమొదటి విమర్శ కూడా అతి త్వరలోనే తొలగిపోవడం ఖాయం.