తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కన్న కూతురే కన్నతల్లిని హత్య చేసిన ఉదాంతం వెనక మరో కోణం వెలుగులోకి వస్తుంది. నగరం శివారులో ముముగనూరు గ్రామం ద్వారకానగర్ లో తన తల్లి అయిన రజితను కీర్తి అనే కన్న కూతురే తన ప్రియుడు శశికుమార్ తో కలిసి అతికిరాతకంగా హత్య చేసింది.
అయితే ఈ హత్య వెనక అక్రమ సంబంధమే ప్రధాన కారణమని నిన్నటి వరకు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా మరో కోణం వెలుగు చూసింది. దాదాపు మొత్తం 10కోట్ల రూపాయల ఆస్తిని కాజేసేందుకే శశికుమార్ ఒక పక్కా పథకం ప్రకారం రజితను ఆమె కుమార్తె కీర్తితో కల్సి చంపించాడాని నిన్న మంగళవారం ద్వారకానగర్లో ప్రచారం జరిగింది.
కీర్తిరెడ్డితో కొంతకాలంగా సన్నిహితంగా అక్రమంగా వ్యవహారం నడిపిన వీడియో పుటేజీలను అడ్డుపెట్టుకుని శశికుమారే ఈ దారుణానికి పాల్పడేటట్లు కీర్తిని బెదిరించాడని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఏది నిజమో పోలీసులే తేల్చాలి ఇక.