ప్రముఖ తెలుగు మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతికి చెందిన తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు అని సమాచారం. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది.విలేఖరి సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఏముందో ఒక లుక్ వేద్దాం..
“ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వంగలపూడి గౌరీ వెంకటరమణ (గౌరీ), మడగల దొరబాబుల బలహీనతలను ఆసరా చేసుకుని గౌరీపై అధికారులతో రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తానని మృతుడు సత్యనారాయణ బెదిరించి, రూ.మూడు లక్షలు డిమాండ్ చేశాడు. భయపడిన గౌరీ రూ.రెండు లక్షలు చెల్లించాడు. మడగల దొరబాబుపై పాత క్రిమినల్ కేసులు, అతడి వ్యక్తిగత విషయాల్లో కాతా సత్యనారాయణ తలదూర్చి తరచూ ఇబ్బందులకు గురి చేసేవాడని, విలేకరిగా ఉన్న పరపతిని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని మద్దాయిలను తరచూ ఇబ్బందులకు గురి చేయడంతో అతడిపై పగ పెంచుకుని పదకం ప్రకారం హత్య చేసినట్లు తేలిందని ఎస్పి చెప్పారు. ఎస్.అన్నవరానికి చెందిన గౌరీ, నక్కపల్లికి చెందిన సకురు దుర్గ, పెనుముచ్చు శివరామకృష్ణ తాతాజీ (తేజ), అల్లాడి బాబ్జి, గంగిశెట్టి జోగి సురేష్, బొక్కిన (బొక్కిస) రమేష్, ఎస్.అన్నవరానికి చెందిన మడగల దొరబాబు విలేకరి సత్యనారాయణను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. నేరస్తులను పట్టుకునేందుకు లక్షకుపైగా ఫోన్ కాల్స్‌ను సమగ్రంగా పరిశీలించామని, సాంకేతిక నిపుణుల సహాయంతో అసలు నేరస్తులను పట్టుకున్నట్టు తెలిపారు. హత్యకు నేరస్తులు వినియోగించిన కత్తి, నాలుగు ఇనుప రాడ్లు, రెండు మోటార్ సైకిళ్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో డీఎస్పీలు రామకృష్ణ, అరిటాకుల శ్రీనువాసరావు, నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.సత్యనారాయణ సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు.
విలేకరి సత్యనారాయణ తేటగుంటలో 2009లో 64.5 సెంట్లు, 2011లో 91 సెంట్లు, 25 సెంట్లు, 50 సెంట్లు, 2013లో 79 సెంట్లు, ఎస్.అన్నవరంలో ఎకరా 20 సెంట్లు, తుని వీరవరపేటలో 267 గజాలు ఇంటి స్థలం, 2015లో ఎస్.అన్నవరంలో 110 గజాల ఇంటి స్థలం, 2016లో టి.వెంకటాపురంలో 182 గజాలు ఇంటిస్థలం, తేటగుంటలో 42 సెంట్ల భూమి, 2019లో టి.వెంకటాపురంలో 25 సెంట్ల భూమి ఇలా భూములు సంపాదించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్.అన్నవరంలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించి అందులో నివాసం ఉంటున్నాడు. ఇవేకాకుండా బ్యాంకు లాకర్లలో మరిన్ని ఆస్తుల వివరాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారని కధనం”అని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు తన బ్లాగ్ లో ఒక వార్త కథనాన్ని ప్రచురించారు.
Tags abn andhrajyothi andhrapradesh crime journalist kommineni info slider