చాలా రోజుల గ్యాప్ తరువాత రానా మీడియా ముందుకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రస్తుతం తన చిత్ర పోస్టర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. శివకుమార్ దర్శకత్వంలో రానా హీరోగా ‘1945’ అనే టైటిల్ తో సినిమా రాబోతుందని ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దీపావళి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో అభిమానులు ఆనందంలో మునుగుతున్న సమయంలో రానా ఒక్కసారిగా ఝలక్ ఇచ్చాడు. ఈ సినిమా విషయంలో నిర్మాత పూర్తిగా విఫలం అయ్యాడని. సంవత్సరం నుంచి నేను వారిని కలవనే లేదు అని అన్నారు. కేవలం డబ్బులకు ఆశపడే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. వీటిని ఎంకరేజ్ చేయకండి అని చెప్పుకొచ్చాడు.
