వచ్చే ఏడాది జూన్ నెల ఒకటో తారీఖు వరకు దేశ వ్యాప్తంగా వన్ నేషన్.. వన్ కార్డు పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులు దేశ వ్యాప్తంగా ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకోవచ్చు అని కేంద్ర మంత్రి పాశ్వాన్. అయితే ఇప్పటికే దీనిని ప్రయోగాత్మకంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని .. రేషన్ కార్డు లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నామని తెలిపారు. అటు రేషన్ లబ్ధిదారుల వివరాలు ఆధార్ తో అనుసంధానం చేస్తున్నామని అన్నారు
