బంగారంపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకు లెక్కలు చెప్పకుండా దాచుకున్న లేదా ఉంచుకున్న బంగారాన్ని బయటకు తెప్పించేలా విధివిధానాలను త్వరలోనే రూపొందించనున్నది అని సమాచారం.
దీంతో ఒక వ్యక్తి ఇక నుంచి పరిమితమైన బంగారం మాత్రమే నిల్వ ఉంచుకునే వీలుంటుంది అని టాక్. అయితే పరిమితికి మించి బంగారం ఉంటే దానికి లెక్కలు చెప్పాలి. మరోవైపు ఒక వ్యక్తి దగ్గర ఎంతమొత్తంలో బంగారం ఉండాలో త్వరలోనే ఖరారు చేయనున్నట్లు కూడా వార్తలు వస్తోన్నాయి.
దీనికోసం గోల్డ్ బోర్డును కేంద్రం ఏర్పాటు చేయనున్నది అని కూడా వార్తలు వస్తున్నాయి.