తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.
ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు రహాదారుల విస్తరణ,స్కైవేలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రక్షణ శాఖ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ -నాగ్ పూర్ ,హైదరాబాద్ – రామగుండం రహాదారులపై స్కైవేలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ కు వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.