తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు, ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ కన్న కలలు త్వరలోనే నిజం కాబోతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దిగువ మానేరు జలాశయం పరిధిలో ఐటీ టవర్ నిర్మాణానికి అప్పటి ఇప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు 2018 జనవరి 8వ తారీఖున శంకుస్థాపన చేశారు.
దీనికి సంబంధించిన నిర్మాణ పనులను మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” మొత్తం ఇరవై ఐదు కోట్లతో సుమారు 62వేల చదరపు అడుగు విస్తీర్ణంలో కంపెనీలకు అందుబాటులో ఉండేందుకు నిర్మిస్తున్న ఈ ఐటీ టవర్ డిసెంబర్ నెలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
మంత్రి కేటీఆర్ కన్న హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలనే కల త్వరలోనే సాకారమవుతుందని”ఆయన అన్నారు.