తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెడుతున్న చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ వద్ద పన్నెండు వందల యాబై ఎకరాల్లో ఏర్పాటవుతున్న పర్యావర్ణ హిత పారిశ్రామిక పార్కు పనులు పూర్తి అవుతున్నాయి.
ఎంఎస్ఎంఈ లకు దేశంలోనే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా దీనిని భావిస్తున్నారు. దీనిని నవంబర్ ఒకటో తారీఖున ప్రారంభిస్తున్నారు. దీనిలో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా దాదాపు నలబై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
నాలుగు వందల యాబై కాలుష్య రహిత కంపెనీల ద్వారా రూ.1550 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది.