ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి తల వెంట్రుకలు నలుపు పోయి తెల్లబడటం మనం చూస్తూనే ఉన్నాము. మరి తెల్ల వెంట్రుకలు నల్లబడాలంటే ఏమి చేయాలి.?. అసలు నల్లవెంట్రుకలు తెల్లగా ఎందుకు మారతాయో ఒక్క లుక్ వేద్దామా మరి..
* విటమిన్ లోపం
తల జుట్టు నెరవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని వైద్యులు చెబుతుంటారు. రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ బి6,విటమిన్ బి12,బయోటిన్,డీ,ఈ విటమిన్లు లోపం వలన ఈ సమస్య ఎదురవుతుంది. అందుకే ఈ విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటే విటమిన్ల లోపం వలన నల్ల జుట్టు తెల్లబడటం తగ్గించవచ్చు.
* వంశపారంపర్యం
మాములుగా వంశపారంపర్యంగా కూడా తల నెరుస్తుందని చెబుతుంటారు. అయితే ఈ సాంకేతాలు ముందే తెలుస్తాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
* ఒత్తిడి,నిద్రలేమి
తల నెరవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి తీవ్రమైన ఒత్తీడి. సమయానికి నిద్రపోకపోవడం. ఇందుకు వేళకు నిద్రపోవాలి. ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం కోసం ధ్యానం,వ్యాయమం లాంటివి చేయాలి.
* తలకు నూనె
ప్రస్తుత అధునీక కాలంలో తలకు నూనె రాయడమే మానేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. అందుకే ప్రతి రోజు కాకపోయిన రెండు రోజులకొకసారి తలకు నూనె రాస్తే మంచిది.
* షాంపూలు
అవసరానికి మించి షాంపూలు వాడకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా రసాయనాలుంటాయి. అందుకే ఎక్కువగా రసాయనాలుండే షాంపూలు వాడకూడదు.వీటిని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.
