Home / TELANGANA / నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు

నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు

నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ (NOA)నూతన కమిటీని సికింద్రాబాద్ లోని మెట్టుగూడ కార్యాలయంలో  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీను నాయక్, ఉపాధ్యక్షులుగా కవిత, జ్యోతి. ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్ రూడవత్, పార మెడికల్ కోర్డినేటర్ మరియు కోశాధికారిగా వంశీ ప్రసాద్ గారిని  ఎన్నుకున్నారు. అలాగే , ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా సిస్టర్ నిర్మల జాయింట్ సెక్రటరీ గా  సుమన్ సతురీ,కిరణ్ నాయక్,బాల చందర్,

ఎక్సక్యూటీ సభ్యులుగా:

స్వాతి,సుజాత,మేఘమాల

లీగల్  అడ్విజర్ గా:

గౌరవ హై కోర్ట్  న్యాయవాది గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారిని ఎన్నుకున్నారు. సలహాదారులుగా చిలుపూరి వీరాచారి మరియు, రామ్ తిలక్ గారిని ఎన్నుకొన్నారు.

తీర్మానాలు:

తెలంగాణా ఉద్యమంలో తమ జీవితాలను, జీతాలను ఫణంగా పెట్టి రాష్ట్ర ఏర్పాటు కోసం మడమతిప్పని పోరాటం చేసిన నర్సింగ్ సమాజం,  రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడుతాయని, ఆత్మగౌరవంతో బతికేందుకు అవకాశం ఉంటుందని కలలుగన్నరు. ఇవి నర్సుల కష్టనష్టాలుకానీ నోట్లో నాలుక లేని వారు ( మా నర్సెస్ ) మాత్రం ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నా సరే లాభమేముందని బాధపడుతున్నారు. రాజకీయ పార్టీల ఆఫీసులకు పోయి కలవాలంటే పలుకుబడి కావాలె గదా? మాకు అంత పలుకుబడి ఎక్కడుంది అని మాకు మేమే తిట్టుకుంటున్నాము.. మా ఓట్లు లక్షల సంఖ్యలో ఉన్నా సరే రాజకీయ పార్టీలు మాత్రం నర్సులను  పెద్దగా పట్టించుకుంటలేవు. ఎందుకంటే మాకు  సేవ చేయడం తప్ప రాజకీయం చేయడం తెలియని బడుగు జీవులము..వాగులు, వంకలు దాటి వైద్యం చేయక తప్పదు.

ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న నర్స్ లకు భరోసా ఏది ?

నర్సింగ్ సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నవారు పేద తరగతి వారే. ఇందులో అన్ని కులాల వారు మరియు అన్ని మతాల వారు ఉన్నారు. అయినా వీరి సంక్షేమం కోసం ఏ రాజకీయ పార్టీ ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. సేవ చేయడమే తప్ప ప్రశ్నించడం తెలియని మూగజీవులు కాబట్టేనా నర్సుల గురించి రాజకీయ పార్టీలు పట్టించుకోవడంలేదు. మారుమూల ప్రాంతాల్లో నర్సులే ప్రాణదాతలు ఐఎంఏ నిర్ధేశ్యాలను పాటించడంలేదు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి 6 గురు రోగులకు 1 నర్సు ఉండాలి. కాని 60 మందికి  ఒక్కరంటేఒక్కరే ఉన్నారంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. గతంలో అనుమతి పొందిన 2458 పోస్టులు ఇప్పటికి ఖాళీగా ఉన్నాయి.

కానీ నిజానికి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తేనే ప్రభుత్వ వైద్యశాలలో  దాదాపు 30 వేల పడకలు ఉన్నాయి.ఆ లెక్కన చూస్తే ప్రభుత్వ వైద్యశాలలో పనిచేయుటకు కావలసిన నర్సుల సంఖ్య దాదాపుగా 18 నుండి 20 వేల మంది నర్సస్ కావాలి కానీ ఉన్నది కేవలం  4000 వేల మంది మాత్రమే  అదేవిధంగా ప్రైవేటు వైద్యశాలలో చూస్తే  ప్రైవేటు వైద్యశాలలో మనకు కావాల్సిన నర్సింగ్ ఆఫీసర్ల  సంఖ్య దాదాపు లక్ష నుంచి 2 లక్షల  మంది. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో వెళ్లి చూస్తే నర్సింగ్ హోమ్ మొదలు  కార్పొరేట్ వైద్యశాల వరకు ప్రతి వైద్యశాలలో నర్సుల కొరత తీవ్రంగా ఉంది కానీ ప్రైవేటు యాజమాన్యాలు ఆ విషయం ఎక్కడా చెప్పడం లేదు. ఉన్నవారితోనే   అధికంగా పని చేపిస్తున్నారు ఐదుగురు చేయవలసిన పనిని  ఒక్కరు చేస్తున్నారు.ఐదుగురు చేయవలసిన పనిని ఒక్కరు చేయడం వల్ల వారు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు  ఉదాహరణకు బిపి మరియు షుగర్, నరాల సంబంధిత వ్యాధులు గాని మరియు వెరికోస్ వీన్స్ తో బాధపడుతున్నారు

 దీంతో ఉన్న వారిపై విపరీతమైన పనివత్తిడితో  అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒక్కో ఆసుపత్రిలో రోజుకు మూడు షిఫ్టులకు కలిపి కేవలం 15 మంది నర్సులు మాత్రమే పనిచేస్తున్నారు.ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ నిబంధనల ప్రకారం పిల్లల ఆసుపత్రుల్లో 1:5 నిష్పత్తి ప్రకారం నర్సులు ఉండాలి. కానీ 60:1 ప్రకారం నర్సులు పనిచేస్తున్నారు.  ఇదే పద్దతి కొనసాగితే తెలంగాణా ఆసుపత్రుల్లో నర్సింగ్ సేవలు దుర్భరంగా మారే ప్రమాదం ఉంది.

నర్సింగ్ స్టాఫ్ నియామకాలు చేపట్టాలి

ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 5633 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 3595 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. అటు 8807 వేల ప్రైవేట్  వైద్యశాలల్లో 35వేల మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4 వేల మంది రెగ్యులర్ నర్సింగ్ స్టాఫ్, మరో 5 వేల మంది కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. మిగిలిన 23 వేలమంది నర్సింగ్ స్టాఫ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో దుర్భరమైన పరిస్ధితుల్లో పనిచేస్తున్నారు.

ఉదాహరణకు గాంధీ ఆసుపత్రిలో800 మంది స్టాఫ్ నర్స్లు మరియు 200 మంది హెడ్ నర్స్లు ఉండాల్సిండగా కేవలం 190 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒక్కఉస్మానియా ఆసుపత్రిలో 1012 పడకలుంటే రోజూ 1500 నుండి 2000 మంది రోగులు వస్తుండగా  పదిహేను మంది రోగులకు ఒక్క నర్స్ అందుబాటులో ఉన్నారు. నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. అక్కడ 1000 మంది  రోగులకు కేవలం 110 మంది నర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే షిప్ట్ కు కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు.

కనీస వసతులు కల్పించాలి.. ఇంటర్న్ షిప్ పేరిట శ్రమదోపిడి ఆపాలి

రెగ్యులర్ నర్సింగ్ స్టాఫ్ సరిపోకపోవడంతో కాంట్రాక్ట్ నర్సింగ్ స్టాఫ్ ను, కొత్తగా ట్రైనింగ్ చేస్తున్నవారిని ఇంటర్న్‌షిప్‌ పేరుతో అధికారులుశ్రమ దోపిడికి గురిచేస్తున్నారు. మరో వైపు కొత్తగా కాంట్రాక్ట్ పద్దతిలో వచ్చే వారికి అతి తక్కువ వేతనాలు సుమారు 8 నుంచి 10 వేల లోపు ఇస్తుండడంతో కుటుంబాలు గడవక ఇబ్బందుల పాలవుతున్నారు. మహిళా నర్సింగ్ స్టాఫ్ కు కనీసం ప్రసూతి సెలవులు  కూడ ఇవ్వడం లేదు. పీఎఫ్‌, మెడికల్‌ లివ్స్‌, బోనస్‌, ఈఎల్స్‌ ఏవీ ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగ భద్రతలేదు, ఆరోగ్య కార్డులు లేవు. వేతనాలు స్ధిరీకరణ లేదు.

అటకెక్కిన నర్సింగ్ డైరెక్టరేట్ హామీ..ని అమలు చెయ్యాలి

నవంబర్ 16, 2017 న శాసనసభ సాక్షిగా నర్సింగ్  డైరెక్టరేట్ ను  ఏర్పాటు చేస్తామని మాజీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి మాట తప్పారు. నర్సింగ్ విద్య బలోపేతానికి నర్సింగ్ డైరెక్టరేట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను అమలుచేయకపోవడం వల్ల నర్సింగ్ స్టాఫ్ సమస్యలను ప్రభుత్వానికి నివేదించే  డాక్టర్లు విఫలం చెందుతున్నారు. నర్సింగ్ సమస్యలు వారికి అర్థం కాక.

 ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులకు కనీస వేతనాలు కల్పించాలన్న డిమాండ్ నెరవేరడంలేదు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జాతీయ ఆరోగ్యమిషన్ పథకాలను విజయవంతంగా ప్రజలవద్దకు తీసుకువెళ్లేందుకు నర్సింగ్ స్టాఫ్  చేస్తున్న కృషిని గుర్తించేందుకు దోహదం చేసే నర్సింగ్ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలి.

అంతే కాకుండా

నర్సింగ్ డైరెక్టరేట్.. వల్ల కలిగే లాభాలు..

నర్సింగ్ డైరెక్టరేట్ ను నియ‌మించాలి. అప్పుడే న‌ర్సింగ్ కోర్సులు చేసిన వారికి నాణ్య‌మైన విద్య అందుతుంది.

– ప‌దోన్న‌తుల విష‌యంలో కేవలం ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారికే కాక ఇతరత్రా అంశాలను కూడా పరిగణలోనికి తీసుకొనే అంశాన్ని నర్సింగ్ డైరెక్ట‌రేట్ ప‌రిశీలించేందుకు వీలుంటుంది.ప్రత్యేక నర్సింగ్ డైరెక్టరేట్ ఉండడం వ‌ల్ల న‌ర్సుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తుంది.

– ప్ర‌త్యేక బ‌డ్జెట్ పుణ్య‌మాని నర్సింగ్ విద్యార్థులలో స్కాలర్స్  పెరిగే అవకాశాలు ఉన్నాయి.నర్సింగ్ విద్యార్థులు పరిశోధన దిశగా అడుగులు వేసే అవకాశాలు, తదనుగుణంగా నర్సింగ్ జర్నల్స్ పెరిగే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.అదే విధంగా నర్సులు నూతన పరికరాలు కొనుగోలు చేయడానికి వీలుంటుంది

                                                                                                                                                                                                                     సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అమలు  చెయ్యాలి

సర్వోన్నత న్యాయస్ధానంలో దాఖలైన WP No. 527 /2011 అనుసరించి, సెప్టెంబర్ 20, 2016 లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జగదీష్ ప్రసాద్ కమిటీ సిఫారసులను యధాతథంగా అమలు చేయాలి. సుప్రీం కోర్టు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిబంధనల మేరకు నర్సింగ్ ఆఫీసర్ ల వేతనాలను అమలు చేయాలి. ఈ సూచనలననుసరించి ఇప్పటికే కేరళ , తమిళనాడు, కర్ణాటక,  ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ఢిల్లీ మహారాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాము అని నోటిఫికేషన్ విడుదల చేశాయి

 రాష్ట్రములోని నర్సుల స్ధితిగతులను అధ్యయనం చేసేందుకు  ఓకమిటీ ని ఏర్పాటు చెయ్యాలి.

నర్సింగ్ సమాజం డిమాండ్స్.

➡ సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే  స్టాఫ్ నర్సు ల జీతాలు కనీస వేతనం నెలకు  రూ.20,000 గా ఇవ్వాలన్న చట్టం తేవాలి.

(The recommendation of the committee constituted under ministry of health and welfare (vide order No: Z-29011/15/2013-N dated 24.02.2016 in compliance of HON’BLE apex court JUDGMENT dated 29.01.2016 in W.P.(C)527/2011)

➡ జెండర్ తో నిమిత్తం లేకుండా మేల్ నర్స్ మరియు  ఫిమేల్ నర్స్ లకు కూడా సమాన ఉద్యోగ అవకాశాలు కలిపించాలి.

➡ ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగులను  శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి. అలాగే కాంట్రాక్ట్ నర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయాలి.

➡ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్లకు ఉద్యోగ మరియు ఆరోగ్య భద్రత కల్పించాలి.

➡ నర్సింగ్ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలి.

➡ ప్రతి నర్సింగ్ విద్యార్దికి 2017 సంవత్సరం నుంచి కాలేజీ ఫీజు పెంచిన విధంగా స్కాలర్ షిప్ మరియు స్టైఫండ్ వెంటనే పెంచాలి.

➡ నర్సింగ్ కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.

➡ ప్రజాక్షేత్రంలో నర్సింగ్ సమాజం గొంతుక వినిపించేందుకు ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయించాలి.

➡ కేంద్రసర్కార్ సూచనమేరకు  స్టాఫ్ నర్స్ లను, నర్సింగ్ ఆఫీసర్ గా మార్చుతూ ప్రభుత్వం  అనుబంధ ఉత్తర్వులను విడుదల చేయాలి.

➡ పేద నర్సింగ్ కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున నర్సింగ్ సమాజం కోసం కాలనీ ఏర్పాటు చేయాలి.

➡ నర్సింగ్ కుటుంబాలకు కి హెల్త్ కార్డులు ఇవ్వాలి.

➡  ప్రతి జిల్లాలో ప్రభుత్వ  నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలి..

పై డిమాండ్లను సానుకూలమైన మనస్సుతో స్వీకరించి ఆరోగ్యతెలంగాణా

నిర్మాణానికికృషిచేయాలని. విజ్ఞప్తిచేస్తున్నాం.

ఇట్లు

నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat