చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.
ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని చంద్రాపురానికి చెందిన బిందు ,తన భర్త,మామ,అత్త,ఆడపడుచులు,వారి భర్తలతో పాటుగా ఆరేళ్ళు,తొమ్మిదేళ్ళు,పదకొండేళ్ల వయస్సున్న నలుగురు చిన్నారులు వరకట్నం కోసం తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.