ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గత ఐదేళ్ళు అధికారంలో ఉండి తన క్రిమినల్ మైండ్ తో ఎలాంటి పనులు చేసాడో అందరికి తెలిసిన విషయమే. రైతులను సైతం నామరూపాలు లేకుండా చేసాడు. అయితే ఇప్పుడు దారుణంగా ఓడిపోయినా సరే ఇంకా అలాగే ప్రవతిస్తున్నాడట. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బాబుకు తన కౌంటర్ తో చుక్కలు చూపించాడు.”చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, చిత్తుచిత్తుగా ఓడినా చంద్రబాబు గారి క్రిమినల్ మైండ్ షార్ప్గానే పనిచేస్తోంది. నిరసన ప్రదర్శనలను కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా మరో పార్టీతో చేయించే స్కెచ్ వేశాడు. లాంగ్ మార్చో, షార్ట్ మార్చో. స్పాన్సర్ చేసేది ఆయనే అని అందరికీ తెలిసిపోయింది” అని అన్నారు.
ఇక మరో ట్వీట్ లో “ఇసుక దొరక్క కూలీలు పస్తులుంటున్నారని అంటాడు. ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అదే నోటితో నింద వేస్తాడు. పొరుగు రాష్ట్రాలకు తరలి పోతుందని ఆరోపిస్తాడు. ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు. తను సృష్టించిన ఇసుక మాఫియా ఆదాయం కోల్పోయి బిక్క చూపులు చూస్తోందనేదే అసలు బాధ” అని అన్నారు.
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, చిత్తుచిత్తుగా ఓడినా @ncbn గారి క్రిమినల్ మైండ్ షార్ప్గానే పనిచేస్తోంది. నిరసన ప్రదర్శనలను కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా మరో పార్టీతో చేయించే స్కెచ్ వేశాడు. లాంగ్ మార్చో, షార్ట్ మార్చో. స్పాన్సర్ చేసేది ఆయనే అని అందరికీ తెలిసిపోయింది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 30, 2019