అనంతపురం జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణను ముఖ్యమంత్రి జగన్ ప్రశంసిచారని వార్త వచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా స్కీమ్ ను చక్కగా అమలు చేసి, రైతులందరికి డబ్బులు అందేలా చేశారని ఆయన మెచ్చుకున్నారు .రైతు భరోసాపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 4,81,498 రైతు కుటుంబాలకు భరోసా కింద రూ.390 కోట్లు జమ చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, బ్యాంకర్ల సహకారంతో భరోసా సమర్థవంతంగా అమలు చేశామన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
