ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ కష్టం మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి పార్టీలో చేర్చుకుని చంద్రబాబు తాజాగా తన పార్టీ ద్వారా వచ్చిన పదవికి పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా పార్టీని వీడుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనుద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఇంకా ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ వైసిపి గాని ప్రభుత్వ పెద్దలు కానీ ముఖ్యమంత్రి జగన్ కానీ వంశీని పార్టీలోకి రావాలని బలవంతంగా కారులో వంశీకి తనకుతానే స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారు. గతంలో తానే ఫిరాయింపులు ప్రోత్సహించి రాజ్యాంగానికి విరుద్ధంగా చేసుకున్న చంద్రబాబు ఇపుడు స్వచ్ఛందంగా ఓ ఎమ్మెల్యే పార్టీకి పదవికి రాజీనామా చేసి వెళుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర ప్రజలకు హాస్యాస్పదం గా కనిపిస్తుంది.
