మహారాష్ట్రలో అధికారాన్ని చేజిచ్చుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ తమ మిత్రపక్షమైన శివసేనకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర లో బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో శాసనసభాపక్షనేతగా ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సీఎం పదవీపై పట్టు వదలని శివసేనకు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను ఇస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే మొదటి నుంచి సీఎం కుర్చీ కోసం ఆరాటపడుతున్న తాజా బీజేపీ ఆఫర్ పై శివసేన ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
