తెలంగాణ కు కలెక్టర్ గా సేవలందిస్తున్న యువ అధికారి ఆమ్రపాలి గురించి బహుశా తెలుగు ప్రజల్లో తెలియని వారుండరు. అయితే తాజాగా ఆమ్రపాలి ని కేంద్ర కాబినెట్ డిప్యూటీ సెక్రటరీగా నియమించింది. డిప్యూటీ సెక్రటరీగా నియమించి ఈ పద్ధతి ద్వారా ఏపీకి సేవలందించేందుకు ఆమ్రపాలిని నియమించనున్నారు. ఆమ్రపాలి ఈ పదవిలో మొత్తం నాలుగేళ్ల పాటు కొనసాగుతారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యువ అధికారులు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లు ఎక్కడున్నా తమ రాష్ట్రానికి ప్రస్తుతం అవసరమని ఇప్పటికే చాలా మందిని రాష్ట్రానికి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ ఇప్పుడు నేరుగా ఏపీకి పంపించడం పట్ల అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.