ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినేట్ ఈ రోజు గురువారం సమావేశమైంది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని క్యాబినేట్ ఈ నిర్ణయాలకు ఆమోద ముద్రవేసింది.
వచ్చే ఏడాది జనవరి 26వ తారీఖు నుంచి అమ్మఒడి పథకం అమలు చేయనున్నది. అంతేకాకుండా డెబ్బై ఏడు గిరిజన మండలాల్లో పౌష్టికాహారానికి రూ.90కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గ్రామీణ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దేవాలయాల్లో ట్రస్టు బోర్డుల నియమకానికి సంబంధించిన చట్ట సవరణకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. కృష్ణా గోదావరి కాలువల శుభ్రతా మిషన్ కు అంగీకారం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ పట్టాల రెగ్యులరైజ్ కు ప్రణాళికలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది.
