గంగూలీ ఎక్కడైనా దాదా నే..అప్పుడు భారత జట్టులో ఇప్పుడు బోర్డులో. ఇక అసలు విషయానికి వస్తే మొన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లు జరగలేదు. కాని మొదటిసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఈ రూల్ మొదలైంది. అది హైలైట్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు అదే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ఇండియాలో కూడా జరగనుంది. నవంబర్ 3 నుండి ఇండియాతో బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో భాగంగానే చివరి టెస్ట్ కోల్కతా లోనే ఈడెన్ గార్డెన్స్ లో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ డే/నైట్ చెయ్యాలని నిర్ణయించారు. దాదా ప్రెసిడెంట్ గా అడుగుపెట్టిన వేలావిశేషం ఏమోగాని కొత్తవాటికి శ్రీకారం చుడుతున్నారు. అంతేకాకుండా కోల్కతా అంటే ముందుగా గుర్తొచ్చేది గంగూలీ నే.
