తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ ఓడిపోయిన 150 రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీగా కూడా టిడిపి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ కోవలోనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీని వీడుతారా అనే వార్తలు వినిపిస్తున్నాయి. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా కేడర్ కోసం పార్టీ మారాలని అనేకమంది ఆయనపై ఒత్తిడి చేస్తున్నారట. ఇదే విషయాన్ని రామానాయుడు పాలకొల్లుకు చెందిన టీడీపీ యువ నాయకులతో చర్చించారట. పాలకొల్లుకు చెందిన రామారావుతో ఇదే విషయాన్ని చర్చించారట. ఇలా ఉన్న కొద్దిపాటి సీనియర్లు కూడా టీడీపీని పెడితే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సహా ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయగా మరో ఎనిమిది మంది వైసీపీ లోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు.