స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది వారి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య-2 సినిమాలే. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేయడమే కాకుండా అప్పట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసాయి. అయితే వీరిద్దరూ వారి మూడో చిత్రం తీయనున్నారు. దీంతో హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఇప్పుడు సుకుమార్ శేచాచలం అడవుల్లో స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తియ్యాలని నిర్ణయించగా దానికి బన్నీ తిరస్కరించడంతో పాటుగా ఒక మంచి లవ్ అండ్ డిఫరెంట్ గా స్టొరీ ఉండాలని చెప్పగా మల్లా ఆర్య వంటి కధ కోసం సుకుమార్ తన మెదడకు పని చెప్పాడట. అయినప్పటికీ అది సెట్ కాకపోవడంతో కధ మల్లా మొదటికి వచ్చింది. ఇక చివరికి ఒక మంచి యాక్షన్ టైప్ లో సినిమా తియ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
