దేశీయ మార్కెట్లు ఈ రోజు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 11,787దగ్గర స్థిరపడింది.
ఇక మార్కెట్ విషయానికి వస్తే టీసీఎస్ ,రిలయన్స్ ,టాటా మోటర్స్ ,ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంకు,మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. ఇటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ.70.84గా ఉంది.