తాజాగా ముగిసిన దీపావళి పండుగ టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట మరింత కాంతివంతంగా జరిగింది. దీపావళి రోజు కేవలం చిరంజీవి కుటుంబమే కాకుండా మొత్తం కొణిదెల ఫ్యామిలీ అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఆదివారం రాత్రి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, టవర్ స్టార్ నాగబాబు కుటుంబం కూడా పాల్గొన్నాయి. అన్నయ్యతో కలిసి ఈ ఇద్దరు మెగాబ్రదర్స్ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. తన నలుగురు పిల్లలతో కలిసి (రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య, అన్నాలెజినోవా పిల్లలు మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజన పవనోవ) కూడా పాల్గొన్నారు. అలాగే పవన్ భార్య అన్నాలెజినోవా కూడా పాల్గొన్నారు. తమ తల్లి అంజనాదేవీతో కలిసి చిరంజీవి, సురేఖ, నాగబాబు అండ్ ఫ్యామిలీ, పవన్ ఫ్యామిలీ సహా ఇతర కుటుంబ సభ్యులు దీపావళి జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. పవన్తన నలుగురు పిల్లలు, భార్య అన్నాలెజినోవాతో కలిసి ఉన్న ఫొటోను జనసైనికులు షేర్ చేస్తున్నారు.