ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ హీరోయిన్ పూనమ్‌కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేసింది. అలాగే పవన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ సినీ డైరెక్టర్‌పై కూడా పూనమ్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఆ టైమ్‌లో వాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్, పూనమ్‌కౌర్‌ల మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందంటూ పూనమ్ పేరుతో యూట్యూబ్‌లో ఓ ఆడియో హల్‌చల్ చేసింది. ఆ ఆడియో టేప్‌పై పూనమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అబద్ధాలకోరు రాజకీయనాయకుడు కాగలడు కాని, లీడర్ మాత్రం కాలేదు..అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. అయితే పేరు మాత్రం చెప్పకుండా జస్ట్ ఏ థాట్ అని మాత్రమే పెట్టింది. దీంతో పూనమ్ పవన్‌ని ఉద్దేశించే ట్వీట్ చేసిందని నెట్‌జన్లు అంటున్నారు. మొత్తంగా ఓ అబద్ధాలకోరు రాజకీయనాయకుడు కాగలడు కాని, లీడర్ మాత్రం కాలేడు..అంటూ పూనమ్ చేసిన ట్వీట్ ఇన్ డైరెక్ట్‌గా పవన్‌కే తగులుతోంది. మరి పూనమ్ ట్వీట్‌పై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
A liar can become a politician but never a leader …. #justathought
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 28, 2019