సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కొడుకుగా అరంగేట్రం చేసిన మనోజ్ కొన్ని మంచి సినిమాల్లో నటించినా ఎక్కువ పరాజయలనే మూట కట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించి షాక్ ఇచ్చారు. తమమధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని మనోజ్ తెలిపారు. అయితే దీపావళి సందర్భంగా మరోకొత్త ప్రకటన చేశారు మనోజ్. సొంతంగా ఓ చిత్ర నిర్మాణసంస్థ ప్రారంభించినట్లు ప్రకటించారు. ‘ఎంఎం ఆర్ట్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించినట్లు మనోజ్ ట్వీట్ చేశారు.
ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ కింద తన కొత్తసినిమా పనులు ప్రారంభమయ్యానని, కొత్త టాలెంట్స్‌ను బయటికి తీసుకొస్తానని భవిష్యత్తులో గొప్ప సినిమాలు అందించడానికి ఎగ్జయిటెడ్‌గా ఉన్నానని పేర్కొన్నారు. దీపావళి రోజున కొత్త జర్నీ మొదలు పెట్టిన తనకు ప్రేక్షకుల ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరారు. మనోజ్ సొంత బ్యానర్‌లో మొదటి సినిమా తానే హీరోగా చేస్తారా లేదా కొత్త వాళ్లతో ప్రయత్నిస్తారో చూడాలి.