క్రొరియోగ్రాఫర్ గా చిత్ర సీమలో అడుగుపెట్టిన రాఘవ లారెన్స్..ఆ తర్వాత నటుడి గా డైరెక్టర్ గా నిర్మాత గా ఇలా తనలోని కోణాలను బయటపెట్టి సక్సెస్ అయ్యాడు. ఆలా సంపాదించిన డబ్బుతో ఎంతోమంది కుటుంబాలను ఆదుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఈరోజు తన పుట్టిన రోజు ఈ సందర్భాంగా గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మరోసారి అందర్నీ ఆకట్టుకున్నాడు. తమిళనాడులో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. బిడ్డను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ తన సానుభూతిని తెలియజేశారు. సుజిత్ ఎక్కడికి వెళ్లిపోలేదని, దేశ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడని లారెన్స్ తన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు. దేశంలో ఎంతో మంది పిల్లలకు తలిదండ్రులు లేరని. అలాంటి పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకుని.. ఆ పిల్లాడికి సుజిత్ అని పేరు పెట్టమని లారెన్స్ కోరారు. ఇలా సుజిత్ తల్లిదండ్రులు ఒక పిల్లాడిని దత్తత తీసుకుంటే.. అతడు చదువుకోవడానికి అయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానని లారెన్స్ వెల్లడించారు.
சுர்ஜித் மீண்டும் வருவான் அவனது பெற்றோருக்கு எனது வேண்டுகோள்குழந்தை சுர்ஜிதின் மரணத்தால் இன்று அக்டோபர் 29 எனது …
Posted by Raghava Lawrence on Monday, 28 October 2019